: ఉత్తర కొరియా ప్రవర్తన సిగ్గు చేటు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట‌్రంప్ ఆగ్రహం
ఉత్తరకొరియా దుందుడుకు చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఫైర్ అయ్యారు. ఆ దేశం పాల్పడుతున్న చర్యలను అడ్డుకునేందుకు ఏదో ఒకటి చేయాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ట్రంప్ పోలాండ్ పర్యటనలో ఉన్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజే డుడాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఉత్తరకొరియా ఎంతో ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ఆ దేశ ప్రవర్తన సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియా చర్యలకు అడ్డుకట్టలు వేసేందుకు పలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పారు.