: 'టెర్రిఫిక్ లుక్స్ తో ఎన్టీఆర్ వస్తున్నాడు'...: 'జై లవ కుశ' టీజర్ చూసేశానన్న సెన్సార్ బోర్డు మెంబర్
ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తుండగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'జై లవ కుశ' చిత్రం టీజర్ నేటి సాయంత్రం 5:22కు విడుదల చేయనుండగా, దీన్ని చూసేశానని చెబుతూ సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ఓ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ కు పండగ రాబోతోందని చెప్పారు. "నేను జై లవకుశ టీజర్ చూశాను. సింప్లీ ఔట్ స్టాండింగ్. గతంలో ఎన్నడూ కనిపించని టెర్రిఫిక్ లుక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. అతని అభిమానులకు ఇది ఎంతో నచ్చుతుంది" అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.