: ఏ సినిమా చూసినా అందులో లవ్‌స్టోరీ ఉంటుంది: నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో నాని కొత్త చిత్రం ‘నిన్నుకోరి’ ఎల్లుండి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ... తాను రెగ్యులర్‌గా లవ్‌స్టోరీలే చెయ్యడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదని వ్యాఖ్యానించాడు. ఏ సినిమా తీసుకున్నా అందులో లవ్‌స్టోరీ కచ్చితంగా ఉంటుంది కదా? అన్నాడు. అయితే తన కొత్త సినిమా 'నిన్నుకోరి'లో డిఫెరెంట్ లవ్ స్టోరీ ఉంటుందని చెప్పాడు. తాను నటించనున్న తదుపరి చిత్రం 'ఎంసీఏ' పూర్తి ప్రేమకథా చిత్రం కాకపోయినప్పటికీ అందులో కూడా కాస్త లవ్‌స్టోరీ ఉంటుందని చెప్పాడు. జీవితంలో చిన్న సమస్య వచ్చినంత మాత్రాన లైఫ్ మొత్తం ఇంతే అని అనుకోవద్దని, ఈ అంశమే ఎల్లుండి విడుదల కానున్న 'నిన్నుకోరి' సినిమాలో ఉంటుందని చెప్పాడు.