: అమరావతిలో ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తాం: ఏపీ ప్రభుత్వం
ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని రాష్ట్ర వేడుకగా జరుపనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరులోని సంగీత నాట్య కళాశాలకు మంగళంపల్లి పేరు పెట్టాలని, ప్రతియేటా ఒక ఉత్తమ సంగీత కళాకారునికి రూ.లక్ష నగదుతో కూడిన అవార్డు ఇవ్వాలని, ఏపీ రాజధాని అమరావతిలో ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు 14 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.