: ఐటీ అభ్యర్థులకు ఎమ్ఎన్సీ క్యాప్‌జెమిని గుడ్‌న్యూస్.. భారీగా ఉద్యోగాలు
ఐటీ రంగంలో ఉద్యోగాల నియామకాలు జరగడం లేదంటూ ఆందోళన చెందుతున్న కంప్యూటర్ గ్రాడుయేట్స్ కు ప్రముఖ బహుళ జాతీయ కంపెనీ క్యాప్‌జెమిని తీపి కబురు అందించనుంది. ఈ ఏడాదిలోనే దేశంలో 20 వేల మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. గతేదాడి 33వేల మంది ఉద్యోగులను నియమించుకున్న ఈ కంపెనీ ఆటోమేషన్ ప్రభావం తమ ఉద్యోగులపై పడకుండా కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందుకుగానూ గత నెల వరకు 45 వేల మందికి రీస్కిల్ చేపట్టినట్లు తెలిపింది. ఆ సంస్థలో ఆటోమేషన్, ఇంటిగ్రేషన్ ఆటోమేషన్‌లో అధికంగా అవకాశాలు ఉంటున్నాయి. ఇందుకోసం ట్రైనింగ్ ప్రొగ్రామ్లలో పెట్టుబడులు పెంచింది. ఆటోమేషన్ ప్రభావం ఉద్యోగులకు మరింత డిమాండ్‌ను పెంచనుందని చెప్పింది.