: ఏకంగా బస్సును దొంగిలించిన 12 ఏళ్ల బాలుడు...వీడియో చూడండి
పిల్లలు చిన్న చిన్న దొంగతనాలు చేయడం విన్నాం కానీ, ఓ పిల్లాడు ఏకంగా బస్సునే దొంగిలించిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. బస్టాండ్ లో ఆగిఉన్న బస్సును ధైర్యంగా నడుపుకుంటూ తీసుకెళ్లిపోయాడు. సుమారు 10 కిలోమీటర్ల దూరం బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. దీనిని మార్గమధ్యంలో చూసిన ఒక వ్యక్తి దానిని వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్ బాలుడు నిబంధనలకు విరుద్ధంగా బస్సు నడుపుతున్నాడని పోలీసులకు సమాచారం అందించాడు. జీపీఎస్ ఆధారంగా బస్సును గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని, బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ గా మారింది. ఆ వీడియో మీరు కూడా చూడండి.