: హైదరాబాదు సచివాలయంలో ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ... భారీగా పోలీసుల మోహరింపు


హైదరాబాద్ లోని సెక్రటేరియేట్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల మధ్య కొద్దిసేపటి క్రితం ఘర్షణ జరుగగా, పరిస్థితి చెయ్యి దాటకుండా చూసేందుకు భారీగా పోలీసులు మోహరించారు. ఏపీ నుంచి వచ్చిన 24 మంది విభాగ అధికారులను విధుల్లోకి తీసుకునే విషయమై ఇరు వర్గాల మధ్యా మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఏపీ నుంచి వచ్చిన వారిని విధుల్లోకి తీసుకోవద్దంటూ తెలంగాణ ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. వారికి ప్రతిగా ఏపీ ఉద్యోగులు సైతం నినాదాలు చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి వెళ్లిపోయిన వారిలో పలువురు తమ ఆప్షన్ అవకాశాన్ని వినియోగించుకుని తిరిగి హైదరాబాద్ రావాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News