: కొత్త నిబంధనను తీసుకొస్తున్న కువైట్.. ప్రవాసుల్లో గుబులు!
బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లిన ప్రవాసుల్లో టెన్షన్ నెలకొంది. దీనికి కారణం ఆ దేశం తీసుకురానున్న కొత్త చట్టమే. తమ దేశానికి వస్తున్న విదేశీయులను కట్టడి చేసేందుకు తాజాగా కువైట్ సిద్ధమైంది. తమ దేశంలో పని చేయాలంటే కనీస వయసు ఉండాల్సిందేనంటూ షరతు విధించబోతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే, 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు కువైట్ లో పని చేయడానకి అర్హత పొందలేరు. 30 ఏళ్లు పైబడిన ప్రవాసులకే ఆ దేశంలో పని చేసే అవకాశం ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే, ఎంతో మంది అక్కడ ఉపాధిని కోల్పోతారు. దీనికి సంబంధించి 'పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్' కువైట్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే... ప్రవాసులకు కష్టాలు తప్పవు.