: అనంత పద్మనాభుని విలువైన వజ్రాల చోరీ: సుప్రీంకోర్టుకు తెలిపిన దేవాలయం


ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపదను కలిగున్న దేవుడిగా పేరు తెచ్చుకున్న కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయంలో భారీ దోపిడీ జరిగింది. కోట్ల విలువైన అత్యంత పురాతన వజ్రాలు 8 మాయం అయ్యాయి. ఆలయంలో స్వామి విగ్రహ తిలక ధారణ కార్యక్రమంలో నిత్యమూ జరిగే అనుష్ఠానానికీ వీటిని వినియోగిస్తుండగా, వీటి మాయం విషయాన్ని దేవాలయం తరఫు న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టుకు, కేరళ పోలీసులకు తెలిపారు. ఈ విషయాన్ని మాజీ ఈఓ కేఎన్ సతీశ్ రికార్డుల్లోనూ నమోదు చేశారని తెలిపారు.

2015లో వజ్రాలు మాయం కావడాన్ని గుర్తించామని, ఆపై 2016లో ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొన్నారు. ఇదిలావుండగా, గత సంవత్సరం నిర్వహించిన ఆడిట్ లో రూ. 189 కోట్ల విలువైన 766 కిలోల బంగారం పోయినట్టు అధికారులు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ఆస్తులతో (ఇంకా మదింపు చేయని నేలమాళిగలోని సంపద మినహా) అత్యంత ధనిక దేవుడిగా అనంత పద్మనాభుడు అలరారుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News