: హ్యాపీ హోమ్స్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితులు బంటి, సర్దార్ పాత నేరస్తులే!


హైదరాబాదులోని మైలార్ దేవ్ పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ లో దోపిడీకి యత్నంచి ఉద్యోగులు, స్థానికుల అప్రమత్తతతో పరారైన దొంగలను సీసీపుటేజ్ ఆధారంగా పోలీసులు వెంటాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు వాడిన కారు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, నిన్న రాత్రి హ్యాపీ హోమ్స్ ను జల్లెడపట్టి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు అనుమానితుల పేర్లు బంటి, సర్దార్ అని నిర్ధారించారు. వీరిద్దరికీ నేరచరిత్ర ఉందని పోలీసులు అన్నారు.

గతంలో ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ ను దోపిడీ చేసినప్పుడు దొంగలు హ్యాపీ హోమ్స్ లోనే మకాం వేశారని, ఈ సారి దోపిడీ పథకం కూడా హ్యాపీ హోమ్స్ సాక్షిగా జరిగిందని వారిద్దరూ పట్టుబడడంతో అంచనాకు వచ్చారు. వారు వాడిన కారు మహ్మద్ ఫజతుల్లా అనే వ్యక్తి పేరిట రిజిస్టర్ అయి ఉందని, అతని వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. కాగా, బంటి, సర్దార్ లు ముంబైకి చెందిన అర్జున్ శెట్టి గ్యాంగ్ సభ్యులని తెలిపారు. మైలార్ దేవ్ పల్లి ముత్తూట్ ఫైనాన్స్  బ్రాంచ్ ను దోచుకునేందుకు దొంగలు పకడ్బందీ ప్రణాళిక రచించారని, ముందురోజు రెక్కీ కూడా నిర్వహించారని పోలీసులు గుర్తించారు. గతంలో మత్తూట్ లో జరిగిన దోపిడీకి, ఇప్పటి సంఘటనకు టవేరా వాహనాన్నే దొంగలు వాడడం గమనార్హం.

  • Loading...

More Telugu News