: రజనీకాంత్ కుమార్తెకు విడాకులు మంజూరు!


కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్‌ కు విడాకులు మంజూరయ్యాయి. రజనీ రెండో కుమార్తె అయిన సౌందర్యకు 2010లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్‌ రామ్‌ కుమార్‌ తో వివాహం జరిగింది. నాలుగేళ్ల పాటు వీరి సంసారం సాఫీగా సాగింది. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2015లో వారికి ఒక బిడ్డ పుట్టాడు. అయితే, బాబు తొలి పుట్టిన రోజు వేడుక సందర్భంగా దంపతుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఆ తరువాత అవి పెరిగడంతో వారిద్దరి మధ్య మరింత దూరం పెరిగింది.

 దీంతో సౌందర్య భర్తకు దూరంగా పుట్టింటికి వచ్చేసింది. వారి సమస్యలు పరిష్కరించేందుకు రజనీకాంత్, ఇతర కుటుంబ సభ్యులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో గత డిసెంబర్‌ లో ఆ దంపతులిద్దరూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులకు పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విచారణ అనంతరం వారిద్దరూ కలిసేది లేదని నిర్ధారించిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. దీంతో సౌందర్య రజనీకాంత్, అశ్విన్ రామ్ కుమార్ చట్టప్రకారం విడిపోయారు. కాగా, సౌందర్య 'వీఐపీ-2' సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News