: టెన్నిస్ రాణికి వార్నింగ్... మ్యాచ్ మధ్యలో లాకర్ రూంకు వెళ్లిన వీనస్!


ప్రముఖ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ కు వింబుల్డన్‌ టోర్నీలో ఊహించని అనుభవం ఎదురైంది. వింబుల్డన్ లో వివిధ నిబంధనలు అమలులో ఉన్నాయి. వాటిని కచ్చితంగా పాటించాల్సిందే. ఆటతో పాటు దుస్తులపై కూడా నిబంధనలు వుంటాయి. ప్రధానంగా వింబుల్డన్ లో వైట్ అండ్ వైట్ ధరించాల్సిందే. అందులో ఎవరికీ మినహాయింపు లేదు. లోదుస్తులు కూడా వైట్ అండ్ వైట్ ధరించాల్సిందే. అలా కాకుండా మరో రంగువి ధరించినా ఆ రంగు కేవలం సెంటీమీటర్ వెడల్పుతో ఉండాలి తప్ప అంతకు మించి ఉండకూడదు.

ఈ నేపథ్యంలో ఐదు సార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన వీనస్ విలియమ్స్ గత మ్యాచ్ లో ఎలీసా మెర్టెన్స్ తో తలపడింది. ఈ సమయంలో తొలి రౌండ్ ముగిసిన సమయంలో ఆమె బ్రా బయటి నుంచి కనిపించింది. అది పింక్ కలర్ లో ఉందని, అది నిబంధనల ఉల్లంఘనే అని వీనస్ ను హెచ్చరించడంతో తొలి రౌండ్ ముగియగానే వీనస్ విలియమ్స్ లాకర్ రూంకి వెళ్లి తన లోదుస్తులు మార్చుకుని వచ్చి టోర్నీలో పాల్గొంది. అనంతరం దీనిపై మీడియా వీనిస్ ను ఈ విషయంపై ప్రశ్నించగా... లోదుస్తుల గురించి మీడియాలో మాట్లాడడం సరికాదని చెప్పి, తప్పించుకుంది. 

  • Loading...

More Telugu News