: ప్రణబ్ కోసం ఇల్లు ఖాళీ చేసిన కేంద్ర మంత్రి!
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రపతి భవన్ ను ఆయన ఖాళీ చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లోకి కొత్త రాష్ట్రపతి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రణబ్ కోసం కొత్త ఇంటిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చివరి క్షణాల వరకు నివసించిన ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్ లోని ఇంటిని ఆయన కోసం అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు. 11,776 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ భవనంలో ప్రస్తుతం కేంద్ర మంత్రి మహేశ్ శర్మ నివసిస్తున్నారు. అయితే ప్రణబ్ కోసం ఆ ఇంటిని ఆయన ఖాళీ చేశారు.