: గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఫోన్లో బెదిరించారు..అవమానకరంగా మాట్లాడారు: మమతా బెనర్జీ ఆరోపణలు


కొంతకాలంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి, గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి మధ్య విభేదాలు తలెత్తడం, పరస్పర ఆరోపణలు చేసుకోవడం తెలిసిందే. తాజాగా, కేసరినాథ్ త్రిపాఠిపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేసరినాథ్ త్రిపాఠి ఈ రోజు తనను ఫోన్లో బెదిరించారని, అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. నామినేటెడ్ వ్యక్తి అయిన గవర్నర్, ప్రజలతో ఎన్నుకోబడిన తనతో ఈ విధంగా మాట్లాడకూడదని ఆయనకు చెప్పానని ఆమె మండిపడ్డారు.

  • Loading...

More Telugu News