: ఆ థియేటర్‌లో దెయ్యం ఉందంటూ వణికిపోతున్న స్థానికులు!


కర్ణాటకలోని కోలార్‌ జిల్లా ముళబాగిలు పట్టణంలోని సంగం థియేటర్ వైపుగా వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఆ సినిమా హాల్‌ కొంతకాలంగా మూతబడి ఉంది. స్థానికులు ఆ థియేట‌ర్‌లోంచి ప‌లు ర‌కాల‌ శబ్దాలు వ‌స్తున్నాయ‌ని, వింత ఆకారాలు క‌న‌ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. ఆ థియేట‌ర్లో దెయ్యం తిరుగుతోందని ఆందోళ‌న చెందుతున్నారు.

ఈ పుకార్లు వేగంగా ఆ చుట్టుప‌క్కల ప్రాంతాలంత‌టా వ్యాపించాయి. దీంతో నిన్న సాయంత్రం వందల మంది గ్రామస్తులు థియేట‌ర్ వ‌ద్ద‌కు చేరుకుని దెయ్యం గురించి స్థానికుల‌ను అడిగి తెలుసుకున్నారు. అక్క‌డ అల‌జ‌డి చెల‌రేగుతుండ‌డంతో స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని జ‌నాన్ని అక్క‌డి నుంచి పంపించేశారు. ఇటువంటి వ‌దంతుల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News