: కోవింద్ కు పాదాభివందనం చేసిన జగన్, విజయసాయిరెడ్డి!


ఎన్నికల ప్రచారం నిమిత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు పర్యటించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆయన, ఇక్కడి ఓ హోటల్ లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా రామ్ నాథ్ కు జగన్ స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేసిన అనంతరం, గౌరవపూర్వకంగా ఆయనకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వేదికపై ఉన్న రామ్ నాథ్ కు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాదాభివందనం చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాలో, సామాజిక మాధ్యమాల్లోకి చేరింది.

  • Loading...

More Telugu News