: రేపు జగన్ ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబునాయుడి అడ్రసు దొరకదు!: కొడాలి నాని


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ, జయంతికి, వర్ధంతికీ తేడా తెలియనటువంటి నారా లోకేశ్ ను తమ పార్టీ అధినేత జగన్ తో పోల్చుకుంటానంటే కుదరదని, అందుకు, ప్రజానీకం ఒప్పుకోదని అన్నారు.

‘లోకేశ్ కు నీళ్లు ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి గల తేడా తెలియదు. సైకిల్ గుర్తుకు ఓటేస్తే మీ ఊరుకి మీరే ఓటు వేసుకున్నట్టు అని చెబుతున్నారు! ఆ రోజున ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని ఆక్రమించుకున్నారు.. ఈ రోజు నీ కొడుకు దద్దమ్మను తీసుకువచ్చి టీడీపీకి అప్పచెప్పావు. నీ చెంచాగాళ్లను తీసుకువచ్చి పొగిడించుకుంటే పొగిడించుకోగానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద గానీ, వైఎస్సార్సీపీ సభ్యుల మీద గానీ అవాకులు చవాకులు పేలితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి... చంద్రబాబును నమ్ముకున్న కొంతమంది అధికారులు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు! రేపు జగన్మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబునాయుడి అడ్రసు దొరకదు. మిమ్మల్ని అందరిణీ గాలికొదిలేసి పారిపోతాడు. కాబట్టి, అవాకులు చవాకులు పేలే వ్యక్తులు గానీ, తెలుగుదేశానికి తొత్తులుగా పనిచేసే అధికారులు గానీ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News