: మరో కొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్


ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మ‌రోసారి తమ వినియోగదారుల ముందుకు ప‌లు ఆఫ‌ర్లతో వ‌చ్చింది. త‌మ‌ పోస్ట్ పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు ఇంత‌వ‌ర‌కు అందిస్తున్న ప్ర‌యోజ‌నాల క‌న్నా 8 రెట్ల అదనపు డేటాను ఇస్తున్న‌ట్లు తెలిపింది.

ఈ ఆఫ‌ర్ ప్ర‌కారం బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ల వివ‌రాలు...
  •  రూ.99 ప్లాన్‌కు- 250 ఏంబీ డేటా
  •  రూ.225 తో 1 జీబీ డేటా
  •  రూ.325తో 2జీబీ డేటా
  •  రూ.725 తో 5 జీబీ డేటా
  •  ప్రీపెయిడ్ వినియోగ‌దారులకి రూ.666తో రీచార్జితో- 129 జీబీ డేటా ( 60 రోజుల వ్యాలిడిటీ)
 కాగా, మిగ‌తా టెలికాం కంపెనీలు అందిస్తోన్న ప్లాన్‌ల కంటే బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫ‌ర్లు అంత‌గా ఆక‌ర్షించేవిలా లేవ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మిగ‌తా కంపెనీలు ఇంత‌కంటే మంచి ప్లాన్‌ల‌నే అమ‌లులో ఉంచాయ‌ని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News