: సెప్టెంబర్ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. 22న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని, 23న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజున శ్రీవారికి ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. 27న గరుడ వాహన సేవ, 28న స్వర్ణ రథోత్సవం, 30న రథోత్సవం, ఆగస్టు 1న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

కాగా, సెప్టెంబర్ 6న పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ ట్రయల్ రన్ ఉంటుందని టీటీడీ జేఈవో తెలిపారు. ఈ సందర్భంగా నూతన స్వర్ణభూపాల వాహనాన్ని శ్రీవారి సేవకు వినియోగించనున్నట్టు చెప్పారు. గరుడసేవ రోజున ఇరవై నాలుగు గంటల పాటు నడకదారి తెరిచి ఉంచుతామని, ఆగస్టు 1 నుంచి పుష్కరిణి శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టనున్నామని చెప్పారు. కాగా, ఈ నెల 27న కొండపైకి ద్విచక్రవాహనాలను అనుమతించమని చెప్పారు.

  • Loading...

More Telugu News