: చూస్తుండండి... ఇండియాపై ఎలా విరుచుకుపడతామో: ఉగ్రవాద నాయకుడు సలావుద్దీన్ హెచ్చరిక


అమెరికా చేత అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించుకున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్, ఇప్పుడు మరింతగా రెచ్చిపోతున్నాడు. ఇండియాలో ఉగ్రదాడులు చేసిన మాట వాస్తవమేనని నిన్న అంగీకరించిన సలావుద్దీన్, ఇప్పుడు ఇంకా పేట్రేగిపోయాడు. "మా దృష్టి అంతా ఇప్పుడు భారత దళాలపైనే ఉంది. వారు ఎప్పుడు, ఎక్కడ ఉంటారో మాకు తెలుసు. కాశ్మీరులో పౌరులు, బహిరంగ ప్రదేశాల్లో దాడులు చేయకూడదని నియమం పెట్టుకున్నాం. మా వ్యవహారాలన్నీ భారత సైన్యానికి వ్యతిరేకంగానే ఉంటాయి. వారిపై ఏ క్షణమైనా విరుచుకుపడతాం. చూస్తుండండి. ఆ బలం, సామర్థ్యం మాకున్నాయి. కాశ్మీర్ లో వారి ఆగడాలను ఆపేందుకు ఒక్క అవకాశాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోనే వేచి చూస్తున్నాం. భారత దళాలకు అనుకూలంగా, ముజాహిద్దీన్ లకు వ్యతిరేకంగా కాశ్మీర్ లో పని చేస్తున్న వారికీ శిక్ష తప్పదు. రాజకీయ నాయకులనూ లక్ష్యం చేసుకుంటాం" అని ఆయన ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News