: మరో అనుమానాస్పద మృతి.. జయలలిత అకౌంటెంట్ ఆత్మహత్య


జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ కు చెందిన అనుమానాస్పద మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఎస్టేట్ కు చెందిన అకౌంటెంట్ దినేష్ కుమార్ నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తగిరిలోని నివాసంలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు నెలల క్రితం కొడనాడు ఎస్టేట్ లో ఒక సెక్యూరిటీ గార్డును దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. జయ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను చోరీ చేయడానికి వచ్చిన వారు, ఈ గార్డును హతమార్చారు. ఆ తర్వాత వీరిలో మరొకరు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మరో వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

  • Loading...

More Telugu News