: జీఎస్టీ ఎఫెక్ట్... 22 రాష్ట్రాల చెక్ పోస్టుల ఎత్తివేత!
జీఎస్టీ ఎఫెక్టుతో 22 రాష్ట్రాలు చెక్ పోస్టులు ఎత్తివేశాయి. జూలై 1 నుంచి వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. దీంతో దేశం మొత్తం ఒకే పన్ను విధానం అమలవుతోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు విధించిన వేర్వేరు పన్నులు చెల్లిస్తున్నారో లేదో చెక్ చేసేందుకు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను 22 రాష్ట్రాలు ఉపసంహరించుకున్నాయి. దీంతో సరిహద్దు రేఖలు చెరిగిపోయాయి. ఇంకా పంజాబ్, అసోం, హిమాచల్ ప్రదేశ్, మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో చెక్ పోస్టులను ఎత్తివేయాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో కొన్ని నిబంధనలు అమలులో ఉండడంతో ఇంకా ఆ చెక్ పోస్టులను ఎత్తివేయలేదు.