: అనంతపురంలో దారుణం...ఇంట్లో తల్లీ కూతుళ్లను కత్తులతో నరికారు!


అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కృష్ణాపురంలో దారుణం చోటుచేసుకుంది. రామసుబ్బారెడ్డి అనే రైతు ఇంట్లో ఆగంతుకులు దారుణానికి తెగబడ్డారు. గుర్తుతెలియని దుండగలు తల్లి సులోచన, కుమార్తె ప్రత్యూష, ప్రసన్నలను కత్తులతో నరికారు. ఈ ఘటనలో సులోచన, ప్రత్యూష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రసన్న కొనవూపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుల బంధువులు రామసుబ్బారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News