: నిరుద్యోగులకు తీపికబురు.. తెలంగాణ వ్యవసాయ, బీసీ సంక్షేమశాఖల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. రెవెన్యూ శాఖలో 2506 ఉద్యోగాల నియామకానికి ఇటీవలే సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు వ్యవసాయ, బీసీ సంక్షేమశాఖల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ పోస్టులను కూడా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయనున్నారు.
ఆయా శాఖల్లో భర్తీ కానున్న పోస్టుల వివరాలు
- వ్యవసాయశాఖ- 753 అధికారుల పోస్టులు
- బీసీ సంక్షేమ శాఖ- 224 ఖాళీలు
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్-2)- 229
- అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్-6
- జిల్లా బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ -4
- జూనియర్ అసిస్టెంట్-9