: పాతికేళ్ల తర్వాత నటుడు సాయిచంద్ మళ్లీ వెండితెరపైకి!
1980లో విడుదలైన ‘మాభూమి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటుడు సాయిచంద్ గుర్తుండే ఉంటాడు. 'మంచుపల్లకి', ‘ఎర్రమల్లెలు’, ‘విముక్తి కోసం’, ‘శివ’, ‘అంకుశం’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చాలా ఏళ్లపాటు సినిమాల్లో ఆయన నటించలేదు. మైత్రీ కమ్యూనికేషన్స్ సంస్థను స్థాపించి పలు డాక్యుమెంటరీలు నిర్మించాడు. తాజాగా, సాయిచంద్ మళ్లీ వెండితెరపై కనపడనున్నాడు. పాతికేళ్ల తర్వాత సాయిచంద్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న 'ఫిదా' చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నాడు. వరుణ్‌తేజ్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.