: అసెంబ్లీ బాగుందంటే టీడీపీలోకి, బాగుండలేదంటే వైఎస్సార్సీపీలోకి వెళ్తున్నాడంటారు: ఉండవల్లి
అసెంబ్లీ కొత్త నిర్మాణం చూడాలని వచ్చానని సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో తెలిసిన వాళ్లు ఉన్నందునే వారితో కలిసి ఇక్కడికి వచ్చానని చెప్పారు. అసెంబ్లీ నిర్మాణం బాగుందని, వర్షపు నీళ్లు వచ్చినంత మాత్రాన వివాదం చెయ్యాల్సిన పనిలేదని అన్నారు. అసెంబ్లీ బాగుందని అంటే టీడీపీలోకి వెళ్తున్నాడని, బాగుండలేదంటే వైఎస్సార్సీపీలోకి వెళ్తున్నాడని అంటారని ఛలోక్తులు విసిరారు. తాను ఏ పార్టీలో లేనని, 2019 ఎన్నికల్లో పోటీ చేయనని ఉండవల్లి స్పష్టం చేశారు.