: రామ్ నాథ్ కోవింద్ కు నేనే స్వయంగా స్వాగతం పలుకుతా: సీఎం చంద్రబాబు


ఎన్నికల ప్రచార నిమిత్తం రానున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు స్వయంగా తానే స్వాగతం పలుకుతానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలుకుతానని చెప్పారు. ఇదిలా ఉండగా, రామ్ నాథ్ కోవింద్ విజయవాడలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే అంశంపై సమన్వయ కమిటీ భేటీలో చర్చించనున్నారు.

పోటీలో ఉన్న అభ్యర్థి స్వామిని దర్శించుకోవడం సరికాదని మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడిన్టటు సమాచారం. అయితే, దేవాలయానికి వెళ్లేది ఓట్లు అడగడానికి కాదు కనుక స్వామి వారి దర్శనం తప్పుకాదని మరికొందరు మంత్రులు తమ అభిప్రాయాలను చెప్పారు. కాగా, రేపు తెలుగు రాష్ట్రాల్లో కోవింద్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి రాష్ట్రపతి ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు ఆయన హైదరాబాద్, అమరావతి సందర్శించనున్నారు.  

  • Loading...

More Telugu News