: అందుకే సరిహద్దుల్లో భారత్ ఇలా ప్రవర్తిస్తోంది: చైనా మీడియా ఆరోపణలు


సరిహద్దు ప్రాంతంలోని డొగ్లాంగ్‌లో చైనా నిర్మిస్తోన్న రోడ్డు నిర్మాణం పట్ల భూటాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో భారత్ చైనాను అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భార‌త్ తీరుపై అభ్యంత‌రాలు తెలుపుతూ చైనా మీడియా ఎన్నో క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భజన చేసేందుకే భారత ప్రధాని మోదీ ఇటువంటి తీరును కనబరుస్తున్నారని ఓ కథనాన్ని ప్రచురించింది. త‌మ దేశం ప్ర‌పంచంలోనే తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న వేళ‌ తమను అడ్డుకునేందుకు ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోప‌ణ‌లు చేసింది.

ఈ క్ర‌మంలోనే భార‌త‌ ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు చైనా-భారత్‌ సరిహద్దులో భారత ఆర్మీ ఇటువంటి చ‌ర్య‌ల‌కు దిగింద‌ని పేర్కొంది. కాగా, డొగ్లాంగ్‌లో చైనా చేప‌డుతోన్న‌ రోడ్డు నిర్మాణం ప‌ట్ల నిర‌స‌న తెలుపుతూ భూటాన్ ఆర్మీ నినాదాలు కూడా చేసింది. అయిన‌ప్ప‌టికీ చైనా ఇటువంటి క‌థ‌నాలు ప్ర‌చురిస్తూ భార‌త్‌పై త‌న తీరును బ‌యట‌పెట్టుకుంటోంది. 

  • Loading...

More Telugu News