: వైసీపీలో చేరనున్న మల్లాది విష్ణు... ముహూర్తం ఖరారు!
ఏపీలో ఇప్పటికే దుకాణం మూసేసుకున్న కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలింది. విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు వైసీపీలో చేరబోతున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఆయన ఇప్పటికే తన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో చర్చలు జరిపారు. వైసీపీ నేతలతో కూడా చర్చలు పూర్తయ్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆయన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఒకవైపు, 2019 ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు మరింత బలపడేందుకు తీవ్ర యత్నాలు చేస్తుండగా... మరోవైపు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం నానాటికీ దిగజారుతోంది.