: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల దుర్మరణం


పూణే-అహ్మద్ నగర్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే, పూణేలో వివిధ ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న 13 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అహ్మద్ నగర్ లో జరిగిన స్నేహితుడి వివాహానికి ఓ మినీ బస్సులో వెళ్లారు. ఆ తర్వాత వారు తిరిగి వస్తుండగా, పూణేకు నలభై కిలోమీటర్ల దూరంలో వారు వస్తున్న వాహనాన్ని ఎదురుగా వేగంగా వస్తున్న ఓ ట్యాంకర్ ఢీకొంది.

నిన్న జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు టెక్కీలు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరో వ్యక్తి మృతి చెందాడు. మరణించిన వారిలో ఇద్దరు మహిళా టెక్కీలు కూడా ఉన్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ఏడుగురి మృతికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. 

  • Loading...

More Telugu News