: రిషబ్ పంత్ కి ఎందుకు అవకాశమివ్వలేదు?: కోహ్లీపై మండిపడుతున్న నెటిజన్లు


భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన నాల్గో వన్ డేలో 11 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ వన్డేలో మార్పులు చేస్తానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించినప్పటికీ, జట్టులో ఎటువంటి మార్పులు జరగలేదు. యువ ఆటగాడు రిషబ్ పంత్ కు అవకాశం దొరుకుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో, సామాజిక మాధ్యమాల వేదికగా కోహ్లీపై నెటిజన్లు మండిపడుతున్నారు.

 ‘రిషబ్ పంత్ కి ఎందుకు అవకాశమివ్వలేదు?’, ‘యువ ఆటగాళ్లకు ఎందుకు అవకాశమివ్వవు?’, ‘ యువరాజ్ గాయపడితే పంత్ కి అవకాశం ఇవ్వొచ్చు కదా!, దినేశ్ కార్తీక్ ను జట్టులోకి తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం?’, ‘ఆడే అవకాశం అందరికీ వస్తుంది. ఒక్క రిషబ్ పంత్ కి తప్పా’ అంటూ నెటిజన్లు కోహ్లీపై విమర్శలు గుప్పించారు. కాగా, భారత్-వెస్టిండీస్ వన్డే క్రికెట్ సిరీస్ లో చివరిది, ఐదో వన్డే ఈ నెల 6న జమైకాలోని కింగ్ స్టన్ మైదానం వేదికగా జరగనుంది. కనీసం, ఆఖరి వన్డేలో నైనా రిషబ్ పంత్ కి అవకాశం కల్పిస్తారా? లేదా? అనే విషయమై ఆసక్తి నెలకొంది.


  • Loading...

More Telugu News