: 25 వారాల పిండాన్ని తొలగించుకునేందుకు మహిళ పిటిషన్... సుప్రీంకోర్టు అనుమతి
తన గర్భంలో వున్న పిండానికి లోపాలు ఉన్నాయని, ఆ పిండాన్ని తొలగించుకుంటానని ఓ మహిళ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. ఆమె కడుపులో ఇరవై ఆరు వారాలు పెరిగిన ఆ పిండాన్ని తొలగించుకోవచ్చని న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఆమెకు పిండాన్ని తొలగించుకునే హక్కు ఉందని తేల్చి చెప్పింది. అంతకు ముందు ఆమెకు వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ఆమె పిటిషన్‌లో పేర్కొన్న విషయాలు నిజమేనని కోర్టుకు చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సదరు మహిళకు తన పిండాన్ని తొలగించుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు వివరించింది.