: అవును... భారత్ పై ఉగ్రదాడులు చేశాను: సయ్యద్ సలావుద్దీన్ నోటి వెంట సంచలన నిజం
ఇండియాపై ఉగ్రదాడులు జరిపిన మాట వాస్తవమేనని హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ అంగీకరించాడు. డొనాల్డ్ ట్రంప్ సర్కారు తనను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించిన తరువాత సలావుద్దీన్ ఈ నిజాన్ని అంగీకరించడం గమనార్హం. ఓ పాకిస్థానీ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, తాను దాడులు ఎలా చేయించిందీ ఆయన చెప్పుకొచ్చాడు. తనను ఉగ్రవాదిగా ప్రకటించడం, అమెరికా వెర్రితనానికి నిదర్శనమని అన్నాడు.
ఇండియా నుంచి కాశ్మీర్ కు స్వాతంత్ర్యం వచ్చేవరకు తమ పోరాటం ఆగదని అన్నాడు. భారత దళాల పాలిట శ్మశానంగా కాశ్మీర్ లోయను మారుస్తానని హెచ్చరించాడు. సలావుద్దీన్ ను ఉగ్రవాదిగా ప్రకటించడాన్ని పాకిస్థాన్ కూడా తప్పుబట్టింది. సలావుద్దీన్ కాశ్మీర్ లో ప్రజల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్నాడని చెప్పిన పాక్, అతనికి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.