: భారత క్రికెట్ దిగ్గజాల సరసన నిలిచిన అజింక్యా రహానే!


భారత దిగ్గజ మాజీ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ల సరసన ఓపెనర్ అజింక్యా రహానే నిలిచాడు. ఒకే ద్వైపాక్షిక సిరీస్ లో 50కి పైగా పరుగులను వరుసగా నాలుగుసార్లు నమోదు చేసిన ఆటగాడిగా ఘనతను సాధించాడు. రహానే కు ముందు ఒక ద్వైపాక్షిక సిరీస్ లో వరుసగా నాలుగు మ్యాచ్ లలో 50కి పైగా పరుగులు చేసిన ఇండియన్ ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ లు మాత్రమే.

ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లో 62, రెండో మ్యాచ్ లో 103, మూడో మ్యాచ్ లో 72, నాలుగో మ్యాచ్ లో 60 పరుగులను రహానే సాధించాడు. వరుసగా నాలుగు మ్యాచ్ లో 50కి పైగా పరుగులను సాధించిన ఇతర ఆటగాళ్లలో అజారుద్దీన్, గంగూలీ, ద్రావిడ్, సిద్ధూ, కోహ్లీ, సురేష్ రైనాలు ఉన్నారు. వీరిలో సచిన్, అజారుద్దీన్ లు రెండు సార్లు ఈ ఘనతను సాధించారు. మరోవైపు సచిన్, ద్రావిడ్, కోహ్లీల పేరిట ఐదు వరుస మ్యాచ్ లలో హాఫ్ సెంచరీలు చేసిన రికార్డ్ ఉంది.

  • Loading...

More Telugu News