: ఇదే నా 'బెస్ట్ బ్రేక్ ఫాస్ట్' అంటూ ఫొటో పోస్ట్ చేసిన సచిన్!
తన కుమారుడు అర్జున్ తన కోసం తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ చూసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మురిసిపోయాడు. 'నా కోసం నా కుమారుడు అర్జున్ తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ఇది. ఎప్పటికీ ఇదే నా బెస్ట్ బ్రేక్ ఫాస్ట్' అంటూ సోషల్ మీడియా ద్వారా ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు సచిన్. తన కుమారుడు చేసిన వంటకం ఎంతో బాగుందని ఈ సందర్భంగా మెచ్చుకున్నాడు.