: ఇళ్ల స్థలాలను ఆక్రమించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్ట్
తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉన్న ఇళ్ల స్థలాలను ఆక్రమించేందుకు 5 వేల మందితో ఆయన తరలివెళ్లారు. పేదలకు ఇచ్చిన పట్టాలకు సంబంధించిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో చూపాలంటూ జగ్గారెడ్డి ఛలో సదాశివపేటకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో వేలాదిమంది తరలివెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి, జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.