: స్కూల్ లో పిల్లల్ని ఎందుకు చేర్చుకున్నావంటూ ఉద్యోగి చెంపలు వాయించిన మహారాష్ట్ర మంత్రి తండ్రి!


ఆయన మహారాష్ట్ర మంత్రి రంజిత్ పాటిల్ తండ్రి వీఎన్ పాటిల్. గతంలో శాసన మండలి సభ్యుడిగానూ పని చేశారు. ప్రస్తుతం ఏ పదవీ లేని ఆయన, ఓ పాఠశాల తనిఖీకి వచ్చానని చెబుతూ, ఎక్కువ మంది విద్యార్థులను ఎందుకు చేర్చుకున్నావని తిడుతూ పాఠశాల ఉద్యోగిపై వీరంగమాడారు. అతని చెంపలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అకోలా జిల్లాలోని మూర్తిజాపూర్ లో ఈ ఘటన జరిగింది. వీఎన్ పాటిల్ నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ స్కూల్ నడుస్తుండగా, ఆ పాఠశాలలో ఈ సంవత్సరం అధిక సంఖ్యలో విద్యార్థులు చేరలేదని, ఆ కోపంతోనే ఆయన ఇలా చేశారని తెలుస్తోంది. తనను తిడుతూ చెయ్యిచేసుకున్నాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తన తండ్రి ఎవరినీ కొట్టలేదని రంజిత్ పాటిల్ చెబుతుండటం గమనార్హం. పోలీసు విచారణలో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అంటున్నారు.

  • Loading...

More Telugu News