: చైనా ఆశలు ఆవిరి.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగం విఫలం!


డ్రాగన్ కంట్రీ చైనా ఆశలు ఆవిరయ్యాయి. ఆ దేశం చేపట్టిన అత్యంత భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ‘లాంగ్ మార్చ్-5 వై2’ పేరుతో ఆదివారం చేపట్టిన ప్రయోగం చైనాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. చైనా స్పేస్ ప్రోగ్రాంలో ఇది భారీ ఎదురుదెబ్బని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది వెన్‌చాంగ్‌లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్-5 ప్రయోగం విజయవంతం కాగా, తాజా ప్రయోగం విఫలం కావడం చైనా శాస్త్రవేత్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఇప్పుడు కూడా అదే వేదిక నుంచి లాంగ్ మార్చ్-5వై2ను ప్రయోగించినా భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టడంలో అది విఫలమైంది. లాంగ్ మార్చ్-5వై2 రాకెట్ బరువు 879 టన్నులు. 25 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టే సామర్థ్యం దీని సొంతం. అయితే తాజా ప్రయోగంలో మాత్రం అది మోసుకెళ్లిన 7.5 టన్నుల బరువైన షిజియాన్-18 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది. ఇప్పటి వరకు చైనా ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనది.  

  • Loading...

More Telugu News