: తమిళ హాస్యనటుడు పల్లు బాబు దీనగాథకు స్పందించిన పరిశ్రమ... అవకాశాలిచ్చి ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దర్శక నిర్మాతలు!


‘ప్రేమిస్తే‘ సినిమాలో వృశ్చిక కాంత్‌ గా పరిచయం చేసుకుని, ’నటిస్తే హీరోగా.. ఆ తర్వాత రాజకీయాలు.. తర్వాత సీఎం... అంతవరకు వెయిట్‌ చేస్తా సార్‌!’ అంటూ డైలాగులు చెప్పి నవ్వించిన పల్లు బాబు దీనగాథ కోలీవుడ్ ను కదిలించింది. గుడిలో ప్రసాదం స్వీకరిస్తూ భిక్షాటనతో చూలైమేడులోని గుడి ముందర జీవనం సాగిస్తున్న వైనం మీడియాలో రావడంతో... స్టంట్ నటుడు సాయిదీనా, దర్శకుడు మోహన్ లు అక్కడికి చేరుకుని, అతనిని ఇంటికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేశారు. పల్లుబాబు మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నది అవాస్తవమని, ఇప్పుడు బాగానే ఆరోగ్యంగానే ఉన్నారని, తమిళ దర్శకులు పలువురు అవకాశాలు ఇస్తామని చెబుతున్నారని, త్వరలోనే ఆయన మంచి స్థితిలో ఉంటారని దీనా తెలిపాడు. అవకాశాలు లేకపోవడంతో భిక్షాటనకు దిగాల్సి వచ్చిందని, ఇప్పుడు మిత్రులు చాలా మంది అవకాశాలు ఇస్తామంటున్నారని పల్లు బాబు తెలిపాడు. 

  • Loading...

More Telugu News