: డోకా లాకు పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తున్న భారత్.. 1962 తర్వాత తొలిసారి సరిహద్దులో భారీగా మోహరింపు... టెన్షన్, టెన్షన్!


సిక్కిం సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ మరిన్ని బలగాలను మోహరిస్తోంది. యుద్ధ పద్ధతిలో కాకుండా బలగాలను తరలిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ భారత్-చైనా సైనికులు ఎదురెదురుగా (స్టాండ్ ఆఫ్) నిల్చుని ఎవరూ ఎటూ కదలకుండా అప్రమత్తంగా ఉన్నారు. 1962 తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘ స్టాండ్ ఆఫ్. 2013లో లడఖ్ డివిజన్‌లోని డౌలత్ బేగ్ ఓల్డీ వద్ద 21 రోజులపాటు స్టాండాఫ్ కొనసాగింది. అప్పట్లో చైనా దళాలు భారత్ భూభాగంలోకి 30 కిలోమీటర్ల ముందుకు చొచ్చుకొచ్చాయి. భారత్ బలగాలు రంగంలోకి దిగడంతో చైనా ఆర్మీ వెనక్కి తగ్గింది.

ప్రస్తుతం సిక్కిం రీజియన్‌లోని భారత్, చైనా, భూటాన్ సరిహద్దులో ఉన్న డోకాలాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1962 యద్ధం తర్వాత భారత్ ఈ స్థాయిలో బలగాలను తరలించడం ఇదే తొలిసారి. అయితే గన్ నాజిల్‌ను కిందికి ఉంచడం ద్వారా తాము యుద్ధానికి రావడం లేదన్న సంకేతాలను భారత్ ఆర్మీ పంపింది.

2012లో ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు బంకర్లను తొలగించాలని జూన్1న చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్‌ను కోరింది. అందుకు భారత్ నిరాకరించింది. దీంతో ఆ ప్రాంతం తమదేనని, భారత్‌కు కానీ, భూటాన్‌కు కానీ దానిపై హక్కులు లేవంటూ జూన్ 6న బుల్డోజర్లతో భారత్ బంకర్లను ధ్వంసం చేసింది. దీంతో చైనా ఆగడాలను అడ్డుకునేందుకు ఇండియన్ ఆర్మీ రంగ ప్రవేశం చేసింది. సైనికులను మోహరించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు నెల రోజులుగా అక్కడ స్టాండాఫ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ పెద్ద ఎత్తున బలగాలను తరలించడం చర్చనీయాంశమైంది.

  • Loading...

More Telugu News