: చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్ నీకెర్క్.. పరుగులేమీ ఇవ్వకుండా 4 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించిన వైనం!


ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా కెప్టెన్, లెగ్ బ్రేక్ బౌలర్ డేన్ వాన్ నీకెర్క్ అద్భుత బౌలింగ్‌తో సరికొత్త చరిత్ర లిఖించింది. పురుష, మహిళల క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్‌లో లేని సరికొత్త రికార్డును నెలకొల్పింది. విండీస్‌తో లీస్టర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నీకెర్క్ దెబ్బకు వికెట్లను టపటపా కోల్పోయింది.  25.2 ఓవర్లలో కేవలం 48 పరుగులకే కుప్పకూలింది. 3.2 ఓవర్లు వేసిన నీకెర్క్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా నాలుగు వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు అందుకుంది. కాగా, విండీస్ నిర్దేశించిన 49 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 6.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది.

  • Loading...

More Telugu News