: 12 కోట్లు ఇచ్చానా? ఆ వార్త నిజం కాదు... నమ్మకండి!: నాగార్జున
తన కుమారుడు నాగచైతన్య కోసం కథ తయారు చేయమంటూ మాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి అక్కినేని నాగార్జున 12 కోట్ల రూపాయలు ముందుగానే ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై నాగార్జున స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా.. నాగ చైతన్య సినిమా కోసం బోయపాటికి 12 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. అవన్నీ రూమర్స్ అని, వాటిని నమ్మవద్దని ఆయన అభిమానులకు సూచించారు. ప్రస్తుతం తాను 'రాజుగారి గది-2' లో నటిస్తున్నానని ఆయన తెలిపారు.