: తండ్రిలా ప్రణబ్ తనకు దిశానిర్దేశం చేసేవారంటూ ఉద్వేగానికి లోనైన మోదీ!
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనకు తండ్రిలా దిశానిర్దేశం చేసేవారని చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. రాష్ట్రపతి భవన్ లో ‘ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్మెన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంలో ప్రధాని మాట్లాడుతూ, రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ అధికారంలో ఉండగా పని చేయడం తన జీవితంలోనే గొప్ప విశేషమని అన్నారు. ఆయన తండ్రిలా తనకు దిశానిర్దేశం చేసేవారని, ఆయన తనతో ఎప్పుడూ 'మోదీజీ! మీరు తగినంత విశ్రాంతి తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి' అంటూ జాగ్రత్తలు చెప్పేవారని ఆయన ఉద్వేగానికి గురయ్యారు. త్వరలోనే రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ కాలం ముగియనుందన్న సంగతి తెలిసిందే.