: టాలీవుడ్ కి టాటా చెప్పేశాను...తెలుగులో ఇక సినిమాలు తియ్యను: రాంగోపాల్ వర్మ


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను విమర్శించే వారికి శుభవార్త... రాంగోపాల్ వర్మ టాలీవుడ్ కి టాటా చెప్పేశానని ప్రకటించారు. తెలుగులో ఇకపై సినిమాలు చెయ్యనని అన్నారు. హిందీలోనే సినిమాలు తీస్తానని చెప్పారు. అయితే తన గోల్ ప్రతిరోజూ మారిపోతుంటుందని, రోజుకొక లక్ష్యం ఉంటుందని అన్నారు. బాహుబలి లాంటి డ్రీమ్ సినిమా తీయడం తనకు చేతకాని పని అని స్పష్టం చేశారు. రక్తచరిత్ర 3 సినిమా తీసే ఉద్దేశ్యం లేదని అన్నారు.

మద్దెల చెర్వు సూరి హత్య తరువాత వల్లభనేని వంశీ ఫోన్ చేశాడని, తామిద్దరం ఆ హత్య గురించే మాట్లాడుకున్నామని, అతను నిర్మాతగా రక్తచరిత్ర 3 సినిమా తీయమని మాత్రం అడగలేదని వర్మ స్పష్టం చేశారు. సర్కార్ 3 పరాజయం అయినంత మాత్రాన తాను విఫలమైనట్టు కాదని వర్మ తెలిపాడు. ప్రతి సినిమాకు తాను ఒకేలా ఎఫర్ట్ పెడతానని, అయితే అందులో కొన్ని సక్సెస్ అయితే, మరికొన్ని ఫెయిల్యూర్ అవుతాయనని వర్మ తెలిపారు. 

  • Loading...

More Telugu News