: 'ఖయ్యూం భాయ్' సినిమా హీరో, డైరెక్టర్ కిడ్నాప్... అనంతపురం తరలింపు.. విడుదల!
కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'ఖయ్యూం భాయ్' సినిమాను భరత్ పారేపల్లి రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారమే విడుదలైంది. ఈ నేపథ్యంలో టైటిల్ పాత్ర ధారి కట్టా రాంబాబు, దర్శకుడు భరత్ పారేపల్లి కలసి ప్రయాణిస్తున్న కారును దుండగులు అడ్డుకున్నారు. అనంతరం కారులో వారిని అనంతపురం తీసుకెళ్లి, అక్కడ ఓ హోటల్ లో ఉంచి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అనంతరం కాసేపటికి వారిని వదిలేసిన దుండగులు పరారయ్యారు. ఈ రోజు సాయంత్రం వారు హైదరాబాదు చేరుకోనున్నారు.