: మణికట్టు, గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన వర్ధమాన బాలీవుడ్ నటుడు


బాలీవుడ్ లో ఒక వెలుగు వెలగాలని భావించి, ముంబైకి మకాం మార్చిన వర్థమాన నటుడు ప్రోత్సాహకరమైన అవకాశాలు రాకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గోరెగావ్ లో చోటుచేసుకుంది. గోరెగావ్ ఈస్ట్ లోని వన్రాయి కాలనీలో 23 ఏళ్ల వర్థమాన నటుడు నివాసం ఉంటూ సినీ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే శనివారం రాత్రి సదరు యువకుడు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు స్నేహితులకు వాట్స్ యాప్ లో మెసేజ్ పెట్టాడు.

దీనిని చూసిన అతని మిత్రులు, అతని పిన్ని రాజశ్రీకి ఫోన్ చేసి, జరగబోతున్న దారుణాన్ని వివరించారు. ఆమె వెంటనే తన అక్క పూజకు ఫోన్ చేసి, విషయం వివరించింది. దీంతో అప్రమత్తమైన ఆమె 3:30 గంటల సమయంలో ఇంటర్నెట్ లో అక్కడి పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ వెతికి అక్కడి ఇన్ స్పెక్టర్ ఇంద్రజీత్ పాటిల్ కు విషయం వివరించింది. వెంటనే అప్రమత్తమైన ఎస్సై సిబ్బందితో వెళ్లి అతను నివాసం ఉంటున్న ఫ్లాట్ తలుపులు పగులగొట్టి చూడగా, బాత్రూంలో చేతి మణికట్టు, గొంతు కోసుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో అతనిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

  • Loading...

More Telugu News