: నిబంధనలు అతిక్రమించారంటూ.. రాజశేఖర్ కొత్త చిత్రం యూనిట్ పై పోలీసు కేసు నమోదు
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై రాజశేఖర్ కొత్త చిత్ర నిర్మాతలు, యూనిట్ పై హైదరాబాదు, నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, 'పీఎస్వీ గరుడవేగ' పేరిట ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన తాజా చిత్రం షూటింగ్ నిమిత్తం నారాయణగూడ ఫ్లయ్ ఓవర్ పై ఉదయం 7 గంటల వరకూ అనుమతి పొందిన యూనిట్, ట్రాఫిక్ ను ఆపి రాత్రి నుంచి షూటింగ్ చేసుకుంటున్నారు. ఉదయం 7 గంటల తరువాత కూడా షూటింగ్ కొనసాగుతూ ఉండటంతో, ట్రాఫిక్ స్తంభించింది. అక్కడకు వెళ్లిన పోలీసులు, తక్షణం ఫ్లయ్ ఓవర్ ను ఖాళీ చేయాలని చెప్పగా, యూనిట్ సభ్యులు వాదనకు దిగినట్టు తెలుస్తోంది. దీంతో యూనిట్ పై పోలీసులు కేసు పెట్టారు.