: పారిస్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ... 2 వేల మందిలో టెన్షన్
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నిత్యమూ బిజీగా ఉండే ప్రధాన విమానాశ్రయంలో ఓ ఆగంతకుడు ప్రవేశించాడన్న సమాచారం రావడంతో, ఎమర్జెన్సీ ప్రకటించి దాదాపు 2 వేల మందిని ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులకు అనుమతిలేని ప్రాంతంలోకి ఓ దుండగుడు తిరుగుతున్నట్టు ఎయిర్ పోర్టు సిబ్బందికి సమాచారం అందగా, 2ఎఫ్ టర్మినల్ మొత్తాన్నీ ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఆపై భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనతో 2 వేల మంది టెన్షన్ లో పడిపోగా, 20కి పైగా విమానాలు ఆలస్యం అయ్యాయి. ఎయిర్ పోర్టులో అనుమానాస్పద వస్తువులు ఏవీ లభ్యం కాలేదని అధికారులు వెల్లడించారు.