: శ్రుతి హాసన్ తప్పుకున్న 'సంఘమిత్ర'లో చాన్స్ కొట్టేసిన హన్సిక?


సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తేనాండాల్‌ స్టూడియో లిమిటెడ్‌ తలపెట్టిన ప్రతిష్ఠాత్మక 'సంఘమిత్ర' చిత్రంలో హీరోయిన్ చాన్స్ హన్సిక తలుపు తట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అనుష్క, నయనతారల పేర్లు తొలుత పరిశీలనకు రాగా, చివరకు శ్రుతి హాసన్ ను ఎంపిక చేసినట్టు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమెను గుర్రపు స్వారీ, కత్తియుద్ధం తదితరాల్లో శిక్షణ నిమిత్తం అమెరికాకు కూడా పంపారు. ఆ తరువాత ఏం జరిగిందో? ఏమో? షడన్ గా శ్రుతి తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సి సుందర్ దర్శకత్వం వహిస్తుండగా, గతంలో తన సూపర్ హిట్ చిత్రాలు అరణ్మనై, అరణ్మనై-2ల్లో నటించిన హన్సికనే 'సంఘమిత్ర' పాత్రకూ ఎంపిక చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

  • Loading...

More Telugu News