: హైదరాబాద్ లో భారీగా పట్టుబడిన మందుబాబులు, బైక్ రేసర్లు
మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఎంతగా ప్రచారం చేస్తున్నా మందుబాబులు మాత్రం మారడం లేదు. నిన్న రాత్రి హైదరాబాద్, జూబ్లీహిల్స్ పరిధిలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, పలువురు మందు కొట్టి వాహనాలు నడుపుతున్న వారు పట్టుబడ్డారు. 26 బైకులు, 13 కార్లను నడుపుతున్నవారు మద్యం తాగినట్టు తేలిందని, వారి వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు పెట్టామని పోలీసులు తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిని అదుపు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, రోడ్లపై స్టంట్స్ చేస్తూ, 11 మంది పట్టుబడగా, వారి వాహనాలను సీజ్ చేసి కేసును నమోదు చేశామని అన్నారు.